AP: ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలుంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై అధికారులకు దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వం. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయి. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు MOU కుదిరింది. దీనివల్ల విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది’ అని తెలిపారు.