NLG: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా నార్కట్పల్లి మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఈ నెల నేడు, రేపు మండలంలోని బి.వెల్లెంల ZPHS లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పిడి శంభులింగం తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు సొంతగ్రామం నుంచి టీంను తీసుకునిరావాలని, ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రాలను తీసుకునిరావాలని తెలిపారు.