మంచిర్యాల: జన్నారం పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ మండల స్థాయి సెలక్షన్ పోటీలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఇందులో విద్యార్థులకు వివిధ క్రీడలలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.