తిరుగుబాటు నేపథ్యంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ స్వదేశాన్ని వీడి రష్యా వెళ్లారు. ఈ మేరకు అసద్ తమ దేశంలో సురక్షితంగా ఉన్నారని రష్యా విదేశాంగశాఖ డిప్యూటీ మినిస్టర్ సెర్గీ ర్యాబ్కోవ్ పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లో రష్యా అవసరమైన సహాయం అందజేస్తుందని చెప్పడానికి ఇదో నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఏం జరిగింది, సమస్యను ఎలా పరిష్కరించామనే విషయం బయటకు చెప్పలేనని సెర్గీ తెలిపారు.