TG: సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి జైపూర్ వెళ్లారు. తన బంధువులకు సంబంధించిన ఓ శుభకార్యానికి కుటుంబ సమేతంగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఏఐసీసీ నాయకులతో కలిసి చర్చించనున్నారు.