AP: రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లకు (2024-29) పర్యాటక పాలసీ అమల్లో ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త విధానం ఉంటుందని తెలిపింది. పర్యాటక ప్రాజెక్టుల వద్ద మౌలిక వసతుల కల్పనే పాలసీ ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.