SDTP: గెలిచిన క్రీడాకారులు ఆ గెలుపును నిలుపుకోవాలని, ఓడినా వారు గెలవడానికి ప్రయత్నం చేయాలని విద్యార్థులకు మంత్రి పొన్నం సూచించారు. మంగళవారం హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలోని మినీ స్టేడియంలో సీఎం కప్ -2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై కబడ్డీ, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.