మదుపర్లకు సెబీ హెచ్చరికలు జారీ చేసింది. అనధికార వైబ్సైట్ల నుంచి అన్‌లిస్టెడ్ షేర్లను ట్రేడింగ్ చేయవద్దని సూచించింది. వీటి ద్వారా ట్రేడింగ్ చేయడం వల్ల వ్యక్తిగత వివరాలు అపహరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అందువల్ల అనధికార సైట్లలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని పేర్కొంది. గుర్తింపు ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా మాత్రమే నిధుల సమీకరణకు, షేర్ల ట్రేడింగ్‌కు అనుమతి ఉంటుందని చెప్పింది.