TG: తెలంగాణ తల్లిపై త్వరలో పాట రాస్తానని రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. జాతీయ అవార్డు కంటే రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ తల్లిని చూస్తే వాళ్ల అమ్మని చూసినట్లు ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అమ్మ కూడా అడిగితేనే పెడుతుందని.. అడగకుండానే గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలని పేర్కొన్నారు.