SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలకు సంబంధించి మొదటి సెమిస్టర్ టైం టేబుల్ విడుదల అయింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అధికారి పద్మారావు విడుదల చేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.