కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులై పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీవీ వరాలేలతో కూడిన ‘సుప్రీం’ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, దీనిపై స్పందించిన కేంద్రం.. కొవిడ్-19 మహమ్మారి అనేది గతంలో ఎన్నడూ ఎరుగని విపత్తు అని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రజల ప్రాణాలను కాపాడిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది.