డిస్టెన్స్, ఆన్లైన్లో హైయిర్ ఎడ్యుకేషన్లో కోర్సులను చదువుతున్న విద్యార్థులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రమత్తం చేసింది. ఈ కోర్సులకు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ నోటీసులు వైరల్ అవుతున్నాయని తెలిపింది. కోర్సులకు సంబంధించిన అప్డేట్స్ కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఇస్తామని సూచించింది. UGC వెబ్సైట్ ugc.gov.inలో వచ్చే నోటిఫికేషన్లను మాత్రమే నమ్మాలని స్పష్టం చేసింది.