శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో 40 పరుగులు చేయడంతో టెస్ట్‌ల్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంక తరపున సంగక్కర(12,400), జయవర్ధనే(11,814) మాత్రమే ఈ రికార్డ్ సాధించారు. దీంతో మాథ్యూస్ 8 వేల పరుగులు పూర్తి చేసిన మూడో శ్రీలంక క్రికెటర్‌గా నిలిచాడు.