NZB: బిక్కనూర్ మండలంలోని కంచర్ల గ్రామం నుంచి పెద్ద మల్లారెడ్డి గ్రామాల మధ్య రోడ్డు సక్రమంగా లేకపోవడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామం నుంచి రైస్ మిల్లుకు వడ్లను తరలిస్తున్న ట్రాక్టర్ రోడ్డుపై గుంతల పడటంతో బోల్తా పడింది. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. గుంతలుగా మారిన రోడ్డును వెంటనే బాగు చేయాలని అధికారులను కోరారు.