KMR: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇటీవల స్టెనో, టైపిస్ట్ కం అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించి అర్హుల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచామని DLSA కార్యదర్శి నాగరాణి తెలిపారు. శనివారం జరగాల్సిన పరీక్ష అనివార్య కారణాలవల్ల ఈ నెల 21కి వాయిదా వేశామన్నారు. https://kamareddy.dcourts.gov .in/ సంప్రదించాలని సూచించారు.