ఈ ఏడాదిలో భారత్లో తుఫాన్లు, కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి విపత్తులు సంభవించాయి. జూలై 30న కేరళలోని వయనాడ్ జిల్లాలో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. మేలో ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన రెమాల్ తుఫాను కారణంగా భారీ నష్టం వాటిల్లింది. నవంబర్లో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టించింది. APలో భారీగా వరదలు వచ్చాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్, అసోంలో సంభవించిన వరదల కారణంగా చాలా మంది నిరాశ్రయులయ్యారు.