అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత తిమ్మారెడ్డి శుక్రవారం గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. తిమ్మారెడ్డి మృతికి మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి సంతాపం తెలిపారు.