AP: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుంది. బియ్యం అక్రమాలపై ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ అధికారులు 1,066 కేసులు నమోదు చేశారు. 729 మంది అక్రమ రవాణాదారులను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే, లుకౌట్ నోటీసులు ఇవ్వడంపై విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్ల కౌంటర్ ఇచ్చారు.