»Ap Cm Jagan Warns Ministers That Three Seats Will Be Lost
AP CM Jagan: మూడు సీట్లు పోతాయ్ మంత్రులకు హెచ్చరిక!
ఏపీ(ap)లో పలు శాఖల్లో పనితీరు ఆధారంగా ముగ్గురు మంత్రులను సీఎం జగన్(YS Jagan Mohan Reddy) తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రులు వారి పనితీరును పెంచుకోవాలని సూచించినట్లు సమాచారం. వెలగపూడి సచివాలయంలో మంగళవారం సీఎం జగన్ నిర్వహించిన మంత్రివర్గ భేటీలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జులైలో రాష్ట్ర పరిపాలన వైజాగ్‌కు మారుతుందని సీఎం తన మంత్రులకు సూచన చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆయా శాఖల్లో పనితీరు తక్కువగా ఉన్నవారిని వదిలిపెట్టబోమని సీఎం(ap CM) జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) పలువురు మంత్రులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో రెండు మూడు సీట్లు పోయే అవకాశం ఉందని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా మంత్రులు వారి పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే అందిన నివేదికల ప్రకారం సీఎం జగన్(jagan) ఇప్పటికే ఆయా మంత్రులపై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు సందర్భం లేకుండా ఆకస్మాత్తుగా ఈ అంశం గురించి సీఎం(CM) ప్రస్తావించడం పట్ల మంత్రులు ఎవరిని తొలగిస్తారనే గుబులుతో ఉన్నారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం సీఎం జగన్ నిర్వహించిన మంత్రివర్గ భేటీలో(apcabinet) ఈ అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం.
ఇక ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల్లో గెలుపొందేందుకు పలువురు మంత్రులకు జగన్(jagan) బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో అన్ని ప్రాంతాల్లో ఈ ఎన్నికల్లో గెలుస్తామని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు మార్చి 23న ఎమ్మెల్సీ ఎన్నికల(mlc elections) పోలింగ్ దృష్ట్యా మంత్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆయా స్థానాల్లో వైఎస్సార్సీపీ(YSRCP) అభ్యర్థులు గెలిచేందుకు కృషి చేయాలని మంత్రులకు సూచించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ(TDP) నుంచి పోటీ ఉన్నందున, ఓటింగ్ సమయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని జగన్ మంత్రులను కోరినట్లు సమాచారం.
మరోవైపు ఈ ఏడాది జూలైలో రాష్ట్ర పరిపాలన విశాఖపట్నంలోకి మారుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలిపేందుకు కేబినెట్(apcabinet) సమావేశానికి అధ్యక్షత వహించిన జగన్.. జూలైలో విశాఖపట్నం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా మూడు రాజధానుల ప్రతిపాదనను వైఎస్ఆర్సీ ప్రభుత్వం ముందుకు తెచ్చింది.
అమరావతి నుంచి రాజధాని(capital) తరలింపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల దృష్ట్యా కోర్టు(court)లో కేసు(case) పెండింగ్‌లో ఉన్నందున, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్నం తరలించడానికి సుప్రీం కోర్టు(supreme court) తీర్పు కోసం వేచి ఉంది. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(ap high court) ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను మార్చి 28న సుప్రీం కోర్టు విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.