»Kvp Ramachandra Rao Writes Letter To Ys Jagan Over Ap Issues
KVP: జగన్! ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకు.. మోడీకి లొంగవద్దు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం (Polavaram Project) రాష్ట్రం చేతిలో ఉందని, దీని ఎత్తును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎన్ని ప్రయత్నాలు చేసినా అంగీకరించవద్దని రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP Ramachandra Rao)... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి (Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy) సూచించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం (Polavaram Project) రాష్ట్రం చేతిలో ఉందని, దీని ఎత్తును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎన్ని ప్రయత్నాలు చేసినా అంగీకరించవద్దని రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP Ramachandra Rao)… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి (Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy) సూచించారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చును తగ్గించుకోవడానికి, రిజర్వాయర్ ఎత్తును ప్లస్ 140 అడుగులకు కుదించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని, ఈ ఒత్తిడికి లొంగవద్దని చెప్పారు. ఈ విషయంలో కేంద్రంతో రాజీ పడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర ద్రోహం చేసినట్లు అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం మన చేతిలోనే ఉందని గుర్తు చేశారు. కాబట్టి కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చునని, భూసేకరణ, పునరావాస, పునర్ నిర్మాణాలకు భారీగా డబ్బులు అవసరమని కారణాలు చెబుతాయని, అయినప్పటికీ ఎత్తు తగ్గించేందుకు ఏమాత్రం ఒప్పుకోవద్దన్నారు.
పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) పూర్తిస్థాయిలో… త్వరితగతిన నిర్మించి ప్రజలకు అందించేందుకు కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రాజెక్టు పనులపై కూడా ఆయన స్పందించారు. వైసీపీ ప్రభుత్వానికి (YSRCP Government) , ప్రత్యేకంగా ఏర్పాటయిన ప్రాజెక్టు అథారిటీకి (Polavaram Project authority) నిర్మాణ బాధ్యతలు అప్పగించినప్పటికీ, ఆశించిన వేగంగా పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆ లేఖలో. ఈ ప్రాజెక్టు పూర్తి ఖర్చును కేంద్రం భరించాలని, రాష్ట్రం పైన భారం వేయవద్దని తాను ఆరేళ్ల క్రితం… 2017లో హైకోర్టులో (High Court) పిటిషన్ దాఖలు చేశానని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో అది పెండింగులో ఉందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు చట్టం (ap reorganisation act 2014) ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఎత్తును తగ్గించి, ఖర్చు తగ్గించుకునే కేంద్రం ప్రణాళికలకు లొంగిపోవద్దన్నారు.