సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాటపై ‘పుష్ప ది రూల్’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. థియేటర్ వద్ద జరిగిన తోపులాటలో మహిళ మరణించిన వార్త వినగానే హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన బాలుడి కుటుంబానికి అండగా ఉంటామని నిర్మాణ సంస్థ హామీ ఇచ్చింది.