బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో జొన్నలను చేర్చుకుంటే మెరుగైన ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జొన్నల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. మలబద్ధకం సమస్య దరిచేరదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. శరీరానికి శక్తి అందుతుంది.