పని ఒత్తిడి, రాత్రిళ్లు సరిగా నిద్రపట్టకపోవటం వంటి పలు సమస్యల కారణంగా తలనొప్పి వేధిస్తుంటుంది. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం, నిమ్మరసం సమపాళ్లలో కలిపి రోజులో రెండుసార్లు తీసుకోవాలి. నుదుటిపై రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని చర్మం లోపలికి ఇంకేటట్లు మర్దన చేయాలి. తులసి ఆకులు వేసి మరిగించిన నీరు తాగాలి. ఐస్ ప్యాక్ పెట్టుకున్నా ఉపశమనం లభిస్తుంది.