ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దుండగులు హత్య చేశారు. నెబ్‌సరాయి ప్రాంతంలో నివాసం ఉంటున్న దంపతులు, వారి కుమార్తెను దారుణంగా హత్య చేశారు. ఆ సమయంలో దంపతుల కుమారుడు వాకింగ్‌కి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.