పుష్ప సీక్వెల్ గురించి రోజుకో న్యూస్ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా ఈ సారి పుష్పరాజ్ కోసం భారీ స్టార్ క్యాస్టింగ్ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ స్టార్స్ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. మరో బాలీవుడ్ బడా హీరో పేరు తెరపైకొచ్చింది.. అలాగే మరో బ్యూటీ కూడా ఫిక్స్ అయిందని టాక్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప.. ముఖ్యంగా బాలీవుడ్లో దుమ్ముదులిపేసింది. అందుకే పుష్ప సెకండ్ పార్ట్‌ని అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారు.
బాలీవుడ్లో మరింత హైప్ తీసుకొచ్చేందుకు.. అక్కడి బడా హీరోలను పుష్ప2లో ఇన్వాల్వ్ చేయాలనే ఆలోచనలో.. సుక్కు ఉన్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ పేరు జోరుగా వినిపించింది. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. సల్మాన్ ఖాన్ పేరు తెరపైకొచ్చింది. రీసెంట్గా మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’లో గెస్ట్ రోల్ చేశాడు సల్మాన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో పుష్ప2లో సల్మాన్ కోసం ట్రై చేస్తున్నట్టు టాక్.
ఇదిలా ఉంటే.. ఈసారి ఐటెం బ్యూటీని కూడా బాలీవుడ్ నుంచి దింపాలని చూస్తున్నాడట సుక్కు. ఇప్పటికే దిశా పటాని లైన్లో ఉన్నట్టు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు సాయి పల్లవి పేరు కూడా వినిపించింది. ఇలా రోజుకో కొత్త పేరు తెరపైకి రావడంతో.. అసలు పుష్ప2లో ఎవరు నటించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇలాంటి వార్తల్లో నిజమేంటనేది చిత్ర యూనిట్‌కే తెలియాలి.