చలికాలంలో జుట్టు ఎక్కువగా రాలటంతో పాటు చుండ్రు సమస్య కూడా ఎదురవుతుంది. కొన్ని హెయిర్ ప్యాక్స్‌తో కురులను సంరక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పావుకప్పు ఉల్లిరసానికి 2 చెంచాల కొబ్బరినూనె కలిపి తలకి పట్టించాలి. ఉసిరి పొడి, పెరుగు లేదా కలబంద గుజ్జు, నిమ్మరసం కలిపి తలకి రాసుకోవాలి. వారానికి రెండుసార్లైనా ఈ ప్యాక్స్ వేసుకుంటే చుండ్రు దరిచేరదు. తలపై దురద తగ్గుతుంది. వెంట్రుకలు మృదువుగా, బలంగా తయారవుతాయి.