HYD: నారాయణ కాలేజీలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కాలేజీ బాత్రూంలో తనుష్ నాయక్ (16) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనుష్.. ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. లెక్చరర్ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.