రోజువారీ మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం పోషకాలు, ఖనిజాలు నిండిఉన్న ఆహారం తీసుకోవాలి. నారింజ పండులోని విటమిన్-సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జామ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. యాపిల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అరటి, దానిమ్మ, పైనాపిల్, కివి పండులోని పోషకాలు ఎముకలను బలంగా మార్చుతాయి. మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. నల్లద్రాక్ష, బొప్పాయి, పుచ్చకాయ, బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.