సాధారణంగా ఆకు కూరలతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చలికాలం మెంతికూర తింటే జట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే మధుమేహాన్ని అదుపు చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని ఎముకలను ధృడపరుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.