బాదం ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాదం రోజూ తినడం వల్ల చర్మం గ్లో అవుతుంది. బాదం నూనెను ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. బాదం నూనెను క్రమం తప్పకుండా ఫేస్‌కి అప్లై చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. ఈ నూనె పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో తోడ్పడుతుంది. బాదం పాలు లేదా బాదం పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.