అల్లం, పసుపు ఆరోగ్యానికి ముఖ్య పాత్ర పోషిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం పరగడుపునే నీటిలో అల్లం వేసి మరిగించి అందులో కాస్త పసుపు వేసి తాగితే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో కఫం కరిగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పరగడుపునే తాగడం వల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మానికి తేమ లభించి మృదువుగా మారుతుంది.