ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప-2’. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అత్యధిక స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని 12 వేలకుపైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నెట్టింట హంగామా చేస్తున్నారు.