TG: ప్రపంచవ్యాప్తంగా 33శాతం వ్యాక్సిన్సు, జనరిక్ ఔషధాలు రాష్ట్రం నుంచే సరఫరా అవుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. టీకాలు, జనరిక్ ఔషధాలు, క్యాన్సర్ ఇతర సంక్లిష్ట వ్యాధుల నివారణకు అవసరమైన బయోసిమిలర్స్ ఉత్పత్తిలో రాష్ట్రం ప్రపంచ గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో మరింత ముందడుగు వేసే దిశగా ప్రస్థానం కొనసాగిస్తోందన్నారు.