AP: పేద విద్యార్థుల కోసం వైసీపీ అధినేత జగన్ తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియాన్ని అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారని మాజీ మంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.సెకీ సంస్థతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏం చెబితే జిల్లా ఎస్పీలు అదే చేస్తున్నారని తెలిపారు.