AP: తిరుమలలో నిర్మిస్తున్న భక్తుల వసతి సముదాయం భవన నిర్మాణ పనుల పురోగతిపై టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారలకు సూచించారు. భవనంలో భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. డైనింగ్ హాల్, కళ్యాణ కట్ట, డిస్పన్సరీ సదుపాయాలపై కూడా అధ్యయనం చేశారు.