హెజ్బొల్లాతో ఓ వైపు సంధికి సిద్ధమంటోన్న ఇజ్రాయెల్.. మరోవైపు బీరుట్‌లోని వారి స్థావరాలపై భీకర దాడులు చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఆమోదం తెలుపనున్న సమయంలోనే ఈ దాడులు చేయటం గమనార్హం. దాడి చేసే ముందు అనేక భవనాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రజలను హెచ్చరించింది. ఈ దాడుల్లో ఎంతమంది మరణించారో తెలియరాలేదన్న ఐడీఎఫ్.. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది.