ELR: జిల్లాలో ప్రజా పంపిణీకి సంబంధించి ప్రతినెలా 10వ తేదీ లోపు ఖచ్చితంగా అర్హులైన వారి ఇంటింటికి, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని యండియు ఆపరేటర్లును జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో ఆమె మాట్లాడుతూ.. పిడిఎస్ బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార కూడా పంపిణీ చేయాలన్నారు.