SRD: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేదాన్ని అతిక్రమిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం న్యాల్కల్ మండలం మీర్జాపూర్, చాల్కి, కాకిజన్వాడ గ్రామాల్లో పొగాకు ఉత్పత్తులు, వాటివల్ల జరిగే పరిణామాలు, అనర్దాలపై అవగాహన, ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు.