»Hardik Pandya Surpasses Rafael Nadal Roger Federer Erling Haaland To Create Unique Record
Hardik Pandya: అరుదైన రికార్డ్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్
భారత క్రికెట్ జట్టు (Team India) ఆటగాడు, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన రికార్డును సాధించాడు. సామాజిక మాధ్యమాల్లో (Social Media) ఈ స్టార్ క్రికెటర్ (Star Cricketer) ఎంతో చురుగ్గా ఉంటాడు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో 25 మిలియన్ల ఫాలోవర్లను సాధించిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్ గా నిలిచాడు.
భారత క్రికెట్ జట్టు (Team India) ఆటగాడు, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన రికార్డును సాధించాడు. సామాజిక మాధ్యమాల్లో (Social Media) ఈ స్టార్ క్రికెటర్ (Star Cricketer) ఎంతో చురుగ్గా ఉంటాడు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో 25 మిలియన్ల ఫాలోవర్లను సాధించిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్ గా నిలిచాడు. గ్లోబల్ స్టార్స్ రఫెల్ నాదల్ (Rafael Nadal), రోజర్ ఫెదరర్ (Roger Federer), మాక్స్ వెర్ స్టాపెన్(Max Verstappen), ఎర్లింగ్ హాలాండ్ (Erling Haaland) తదితరుల కంటే ముందుకు చేరుకున్నాడు. ఈ ఘనత సాధించినందుకు గాను పాండ్యా తన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నా పైన ఇంత ప్రేమ కనబరిచిన వారందరికీ థ్యాంక్స్ అని, అభిమానుల్లో ప్రతి ఒక్కరు తనకు ప్రత్యేకమేనని, ఇన్నేళ్ళుగా తనకు మద్దతుగా నిలిచిన, ప్రేమను అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు అని ఇన్ స్టాగ్రామ్ లో అతను పేర్కొన్నారు. 25 కోట్ల మంది ఇన్ స్టా అభిమానులను లేదా ఫాలోవర్లను దక్కించుకున్న పాండ్యా 2016లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంగేట్రం చేశాడు. ఆటతో మాత్రమే కాకుండా, స్టైల్ ఐకాన్ గా నిలిచాడు. 29 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్స్, ఆడియో, డెనిమ్, షర్టులు, బ్యాటరీస్, లూబ్రికేంట్స్, ఎనర్జీ డ్రింక్స్, బిస్కట్స్, క్యాజువల్ దుస్తులు, షూస్, బీవరేజెస్, పర్ఫ్యూమ్స్, మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ తదితర రంగాల్లో ఇరవైకి పైగా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నారు.
ఇటీవల ప్రేమికుల రోజున తన భార్య, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ ను (Natasa Stankovic) మళ్లీ పెళ్లి చేసుకొని, వార్తల్లో నిలిచారు. 2020 మే 20వ తేదీన… కరోనా సమయంలో సింపుల్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట గత నెలలో వాలెంటైన్స్ డే సందర్భంగా మరోసారి సాంప్రదాయబద్ధంగా ఒక్కటి అయ్యారు. పాండ్యా, నటాషా రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లోనే పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు రోజు ఈ జంట ఉదయ్‌పూర్ వెళ్లింది. హిందూ వివాహ పద్ధతిలో పెళ్లికి ముందు జరగాల్సిన కార్యక్రమాలు సహా.. అన్ని కార్యక్రమాలతో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఉదయపూర్ లోని రాఫెల్స్ హోటల్ లో పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. నటాషా రెడ్ కలర్ బార్డర్ కలిగిన క్రీమ్ కలర్ లెహెంగాలో, ఆభరణాలు ధరించింది. అభిమానులు కూడా వారికి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. మూడేళ్ల కిందట పెళ్లి చేసుకున్న హార్దిక్, నటాషాకు రెండేళ్ల కొడుకు అగస్త్య ఉన్నాడు.
హార్దిక్ పాండ్యా 2016 జనవరి 27న ట్వంటీ 20తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టారు. అదే ఏడాది వన్డేలు, టెస్ట్ సిరీస్ లలోను ఆరంగేట్రం చేశారు. చివరిసారి వన్డే ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ తో ఆడాడు. 1996లో జన్మించిన పాండ్యా బరోడా క్రికెట్ జట్టుకు చెందిన క్రికెటర్.