కాంగ్రెస్ సీనియర్ నేత, రాహుల్ గాంధీ (Rahul Gandhi)న్యూలుక్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp nadda) ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ పొడుగటి గడ్డంతో కనిపించాడు. రీసెంట్ గా కేంబ్రిడ్జిలో (Cambridge) రాహుల్ ప్రసంగ సమయంలో సేవ్ చేసుకొని ’న్యూ లుక్’లో కనిపించారు. రాహుల్ తాజా లుక్స్‌తో రాజకీయం చేసే బ్రాండింగ్ యుగం పోయిందని అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాహుల్ గాంధీ (Rahul Gandhi)న్యూలుక్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp nadda) ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ పొడుగటి గడ్డంతో కనిపించాడు. రీసెంట్ గా కేంబ్రిడ్జిలో (Cambridge) రాహుల్ ప్రసంగ సమయంలో సేవ్ చేసుకొని ’న్యూ లుక్’లో కనిపించారు. రాహుల్ తాజా లుక్స్‌తో రాజకీయం చేసే బ్రాండింగ్ యుగం పోయిందని అన్నారు. ఇప్పుడు అసలు ఏంటో కనిపిస్తోంది. ప్రజలకు సేవ చేయడం ద్వారా పేద ప్రజల మనసులను గెలుచుకొనే అవకాశం ఉంది. కానీ, మన రూపాన్ని మార్చుకున్నంత మాత్రాన రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు అంటూ జేపీ నడ్డా తెలిపారు.కేంబ్రిడ్జ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగంపైనా జేపీ నడ్డా స్పందించారు.
ప్రధాని మోదీని (Pm modi) వ్యతిరేకిస్తూనే భారత్ ను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. నిరసన ఏ స్థాయిలో ఉండాలో వారికి అర్ధంకావడం లేదన్నారు. ఏ సమస్యలపై నిరసన వ్యక్తంచేయాలో తెలుసుకోవాలి. సర్జికల్ స్ట్రైక్ (Surgical strike)పై ప్రశ్నలు వేశారు. వైమానిక దాడులపై ప్రశ్నలు లేవనెత్తారు. నేడు పుల్వామాను ప్రశ్నిస్తున్నారు. అదికూడా విదేశాలకు వెళ్లి. ఇది జాతీయతకు నిదర్శనమా అంటూ నడ్డా ప్రశ్నించారు.