ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ‘డిస్ట్రిక్ట్’ పేరిట కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌లో సినిమా టికెట్లు, ఈవెంట్ల కోసం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ టికెటింగ్, లైవ్ షోలు, షాపింగ్ సేవలనూ ఈ యాప్‌లో జోడించింది. కాగా, ఈ ఏడాది ఆగస్టులో పేటీఎం నుంచి టికెటింగ్ బిజినెస్‌ను రూ.2,048 కోట్లకు జొమాటో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.