తమిళనాడులోని తూత్తుకుడిలో కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ను తిరిగి తెరవాలని కోరుతూ వేదాంత లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పర్యావరణ, ప్రజారోగ్య సమస్యల కారణంగా 2018, మే నుంచి ఈ ప్లాంటును మూసివేశారు. గాలి, నీటి కాలుష్యం సహా పర్యావరణ ఉల్లంఘనపై ఆరోపణలను ఎదుర్కొంది. దీనిపై స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు రావడంతో గతంలో ప్లాంట్ను మూసివేశారు.