W.G: ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు అకాల మృతికి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం సంతాపం తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన రామ్మూర్తినాయుడు లేని లోటు తీర్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.