మేడ్చల్: సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక తదితర అన్ని వర్గాల అంశాలను సమన్వయం చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్న వారే పాత్రికేయులు అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ మేరకు శనివారం బీఎన్ రెడ్డి నగర్లో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రిక రంగంలో పని చేస్తున్న పలువురు విలేకరులను ఎంపీ శాలువాతో ఘనంగా సన్మానించారు.