TG: మూసీ పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిద్ర చేసేందుకు బీజేపీ ముఖ్య నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అంబర్‌పేటలోని తులసీ రామ్‌నగర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. మూసీపై బీజేపీ నాలుగు నెలలుగా పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే బాధితులతో తాము ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ఇవాళ బాధితులతో కలిసి నిద్రపోతామని చెప్పారు. సీఎం ప్రకటనలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని అన్నారు.