ఎయిర్టెల్, జియోలకు BSNL షాక్ ఇచ్చింది. గడిచిన 2 నెలల్లో కొత్తగా 65 లక్షల మంది యూజర్లను పొందినట్లు DOT వెల్లడించింది. మరోవైపు ఎయిర్టెల్, జియోలు 40 లక్షల యూజర్లను కోల్పోయినట్లు ప్రకటించింది. ప్రత్యర్థి కంపెనీలు విపరీతంగా రీఛార్జ్ ధరలు పెంచడంతో అందరి చూపు ఇప్పుడు BSNLపై పడిందని పేర్కొంది. BSNL తన కస్టమర్-ఫ్రెండ్లీ టారిఫ్ ప్లాన్లతో యూజర్లను ఆకర్షిస్తోందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అభిప్రాయపడ్డారు.