ASR: గిరిజన విద్యార్థులు ఐఏఎస్ అధికారులుగా ఎదగాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. శనివారం ఆయన లోచలపుట్టు, తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులతో కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారని వారికి సహాయకారిగా ఉండాలని సూచించారు.