మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు మావోయిస్టుల కుట్రను ఛేదించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు ప్లాన్ చేశారు. పార్లకోట నదిపై బామ్రఘడ్-తాడ్గన్ మధ్య బ్రిడ్జిని పేల్చేందుకు మావోయిస్టులు మందుపాతర అమర్చారు. విషయం పసిగట్టిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందంతో వాటిని నిర్వీర్యం చేశారు.