ప్రకాశం: ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను శనివారం ఎస్పీ దామోదర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును పరిశీలించారు. లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీసి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు.