మణిపుర్లో మరోసారి హింస చెలరేగింది. ఇటీవల జిరిబామ్ జిల్లాలో చెలరేగిన అల్లర్లలో ముగ్గురు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లను నిరసనకారులు ముట్టడించారు. దీంతో అధికారులు స్థానికంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు.